Apple | బెంగళూరులో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ఓపెనింగ్‌కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
Apple | దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. ఐ-ఫోన్లు, ఇతర ఉత్పత్తులకు భారత్ బెస్ట్ మార్కెట్‌గా నిలిచిన నేపథ్యంలో ఇండియాలో తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోంది.
Apple | దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. ఐ-ఫోన్లు, ఇతర ఉత్పత్తులకు భారత్ బెస్ట్ మార్కెట్‌గా నిలిచిన నేపథ్యంలో ఇండియాలో తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోంది. ఇక ఢిల్లీ, ముంబైలో రిటైల్ స్టోర్ల (Apple Retail Store)ను తెరిచిన సంస్థ.. ఇప్పుడు మూడో స్టోర్‌ను బెంగళూరు (Bengaluru)లో ఓపెన్ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసింది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2వ తేదీన బెంగళూరులో తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు యాపిల్ తాజాగా ప్రకటించింది. ఈ స్టోర్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్లో ఉంది.
యాపిల్ కళ్లు చెదిరే డీల్..
భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోన్న యాపిల్ సంస్థ.. బెంగళూరులో భారీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌స్టాక్ ప్రకారం.. బెంగళూరు (Bengaluru)లో ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎంబసీ గ్రూప్ (Embassy Group)కు చెందిన కమర్షియల్ ప్రాజెక్టు ఎంబసీ జెనిత్ (Embassy Zenith)లోని ఆ కార్యాలయ స్థలం కోసం 10 ఏళ్ల కాలానికి యాపిల్ సంస్థ డీల్ కుదుర్చుకుంది.
9 అంతస్తుల్లో (5 నుంచి 13వ అంతస్తు వరకు) విస్తరించి ఉన్న ఈ ఆఫీస్ స్పేస్ కోసం యాపిల్ సంస్థ నెలకు రూ.6.3 కోట్ల అద్దె చెల్లించనుంది. ఏడాదికి 4.5 శాతం చొప్పున అద్దె పెంపుతో పార్కింగ్, మెయింటెనెన్స్ చార్జీలతో కలిపిమొత్తం ఈ పదేళ్లలో సంస్థ రూ.1,000 కోట్లను అద్దెగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. 2025 ఏప్రిల్ 3 నుంచి ఈ లీజు అమల్లోకి వచ్చింది. ఈ లీజు ఒప్పందంలో భాగంగా యాపిల్ రూ.31.57 కోట్లు డిపాజిట్ కూడా చేసింది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అతి పెద్ద మొబైల్ ఫోన్ల ఎగుమతిదారుగా యాపిల్ నిలిచిన విషయం తెలిసిందే. సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది.
Also Read..
S Jaishankar | ట్రంప్ టారిఫ్‌ల వేళ.. భారత్‌లో మరింత విస్తరించండంటూ రష్యా కంపెనీలకు భారత్ ఆహ్వానం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

