Kailash Gahlot | అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతగా వ్యవహరించిన అశోక్ గెహ్లాట్ (Kailash Gahlot) నిన్న ఆప్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బీజేపీలో చేరారు.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంలో కైలాశ్ గెహ్లాట్ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఆతిశీ ఆమోదించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాజీనామా అనంతరం ఆయన బీజేపీలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఇవాళ కమలం పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
#WATCH | Delhi: Former Delhi Minister and AAP leader Kailash Gahlot joins BJP, in the presence of Union Minister Manohar Lal Khattar and other BJP leaders. pic.twitter.com/l2Ol8Umxe1
— ANI (@ANI) November 18, 2024
కాగా, రాజీనామా సందర్భంగా ఆప్ ప్రభుత్వంపై కైలాశ్ గెహ్లాట్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం అసంపూర్తి హామీలు ఇస్తోందన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పార్టీ సొంత రాజకీయ అజెండా కోసం పాకులాడుతున్నదని ఆరోపించారు. తాజా పరిణామంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Also Read..
Medical Student | ర్యాగింగ్ పేరిట మూడు గంటలు నిల్చోబెట్టిన సీనియర్లు.. వైద్య విద్యార్థి మృతి
Ambulance | అంబులెన్స్‌కు దారివ్వని వ్యక్తి.. రూ.2.5 లక్షల జరిమానా