Ambulance | అంబులెన్స్‌కు దారివ్వని వ్యక్తి.. రూ.2.5 లక్షల జరిమానా
Ambulance | రోడ్డుపై సైరన్ మోగిస్తూ అంబులెన్స్ (Ambulance) వెళ్తుందంటే ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అర్థం. అందుకే అంబులెన్స్ సౌండ్ వినిపించగానే ఎంతటివారైనా సరే వెంటనే తమ వాహనాలను సైడ్‌కు తీసుకుంటారు.
Ambulance | రోడ్డుపై సైరన్ మోగిస్తూ అంబులెన్స్ (Ambulance) వెళ్తుందంటే ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అర్థం. అందుకే అంబులెన్స్ సౌండ్ వినిపించగానే ఎంతటివారైనా సరే వెంటనే తమ వాహనాలను సైడ్‌కు తీసుకుంటారు. సినీ సెలబ్రిటీలైనా, రాజకీయ నేతలైనా.. చివరికి ప్రధాని, రాష్ట్రపతి అయినా సరే అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇస్తారు. అయితే, కొందరు ఆకతాయిలు ఇవేవీ పట్టించుకోరు.
అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోగా.. అడ్డుగా వెళ్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు (Licence revoked) చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళ (Kerala)లోని త్రిస్సూర్ (Thrissur)లో నవంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని చలకుడిలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. రోడ్డుపై అంబులెన్స్ వెళ్తుంటే అన్ని వాహనాలూ సైడ్‌కు వెళ్లాయి. అయితే, ఓ కారు మాత్రం అంబులెన్స్ ఎంతగా హారన్ కొడుతున్నా, కుయ్ కుయ్ అంటూ సౌండ్ చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ అంబులెన్స్ ఆ కారు వెనకాలే వెళ్లాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు చర్యలకు ఉపక్రమించారు.
వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదో గుర్తించారు. నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. అంబులెన్స్‌కు దారి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో అతడు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు వ్యక్తికి షాక్ ఇచ్చారు. దాదాపు రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతడి లైసెన్స్ కూడా రద్దు చేశారు.
Also Read..
Kailash Gehlot | నేడు బీజేపీలో చేరనున్న కైలాశ్ గెహ్లాట్..!
Delhi Pollution | ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత.. ఇవాల్టి నుంచి కఠిన ఆంక్షలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

