Delhi Pollution | ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఈ సీజన్లో తొలిసారిగా సివియర్ ప్లస్‌కు చేరుకుంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 481కి చేరిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవాల్టి నుంచి స్టేజ్ 4 ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ ఆంక్షల మేరకు నేటి నుంచి ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించారు. నిత్యావసర సేవలు అందించే ట్రక్కులను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించనున్నారు. ఢిల్లీ వెలుపల అయితే రిజిస్ట్రేషన్ ఉన్న తేలికపాటి వాణిజ్య వాహనాలకు ప్రవేశాన్ని నిషేధించారు. బీఎస్4, పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశానికి కూడా అనుమతి లేదు.
ఢిల్లీలో అన్ని రకాల నిర్మాణాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ కాలేజీలను మూసివేయాలని సీఏక్యూఎం సూచించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ 50 శాతం సామర్థ్యంతో పనిచేసేలా ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫారసు చేసింది.
#WATCH | Delhi: A layer of smog envelops the national capital as air quality remains in the ‘Severe’ category as per the Central Pollution Control Board (CPCB).
Drone visuals from the ITO area shot at 7:50 am pic.twitter.com/x7RA2C7wZD
— ANI (@ANI) November 18, 2024