Kailash Gehlot | ఆప్ (AAP) సీనియర్ నేత కైలాశ్ గెహ్లాట్ (Kailash Gehlot) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరబోతున్నట్లు తెలిసింది. ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంలో కైలాశ్ గెహ్లాట్ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆదివారం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఆతిశీ ఆమోదించారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజీనామా సందర్భంగా.. ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పార్టీ సొంత రాజకీయ అజెండా కోసం పాకులాడుతున్నదని గెహ్లాట్ ఆరోపించారు. అయితే గెహ్లాట్ ప్రస్తుతం ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారని, ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం తప్ప ఆయనకు మరో అవకాశం లేదని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Also Read..
Ayatollah Ali Khamenei | కోమా వార్తల నేపథ్యంలో బయటకు వచ్చిన ఇరాజ్ సుప్రీం లీడర్ ఖమేనీ
Nayanthara | ఫ్యామిలీతో కలిసి కుతుబ్‌మినార్‌ను సందర్శించిన లేడీ సూపర్ స్టార్.. వీడియోలు
Hallmarking Gold Rules | హాల్‌మార్కింగ్ లేని బంగారు ఆభరణాలపై కేంద్రం కీలక ప్రకటన..!