Nayanthara | దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్ మినార్ (Qutub Minar)ను లేడీ సూపర్ స్టార్ నయనతార తన కుటుంబంతో కలిసి సందర్శించారు. భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan), ఇద్దరు పిల్లలు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir RudroNeel N Shivan), ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ (Ulag Daiwik N Shivan)తో కలిసి ఆదివారం ఈ ప్రఖ్యాత కట్టడాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులు, అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
కాగా, నయన్.. తమిళ స్టార్ ధనుష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీ రూపంలో రాబోతున్నది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ డాక్యుమెంటరీని నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. అయితే, డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Actress #Nayanthara and director @VigneshShivN take time out from their busy schedules for a family outing to the Qutb Minar. pic.twitter.com/fLygkFqxrh
Needless to say, the celebrity couple were the cynosure of all eyes at the historical monument as delighted fans at the venue…
— Ramesh Bala (@rameshlaus) November 17, 2024
Also Read..
Keerthy Suresh | చిరకాల మిత్రుడితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఈ వార్త నిజమేనా?
ఎక్కడా తగ్గని పుష్పరాజ్ మీ ప్రేమకు తలొంచాడు
అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1