Keerthy Suresh | చిరకాల మిత్రుడితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఈ వార్త నిజమేనా?
Keerthy Suresh | కీర్తి సురేశ్ పెళ్లి ఖాయమైందట. తన చిరకాల మిత్రుడితో పెళ్లికి కీర్తి ఓకే చెప్పిందని, గోవా బీచ్ లొకేషన్లో పెళ్లి వేదికను ఫిక్స్ చేశారనీ, బంధుమిత్రుల సమక్షంలో ఈ జంట ఒకటవ్వబోతున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Keerthy Suresh | కీర్తి సురేశ్ పెళ్లి ఖాయమైందట. తన చిరకాల మిత్రుడితో పెళ్లికి కీర్తి ఓకే చెప్పిందని, గోవా బీచ్ లొకేషన్లో పెళ్లి వేదికను ఫిక్స్ చేశారనీ, బంధుమిత్రుల సమక్షంలో ఈ జంట ఒకటవ్వబోతున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు అవే కథనాలు సౌత్ మీడియాలోనూ వ్యాపించాయి. నిజానికి ఈ తరహా వార్తలు కీర్తి సురేశ్కి కొత్తేం కాదు.
గతంలో సంగీత దర్శకుడు అనిరుథ్తో తను ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లాడబోతున్నదని కొన్ని కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దుబాయికి చెందిన ఓ వ్యాపారితో పెళ్లి ఖాయమైందని కూడా ప్రచారం జరిగింది. అయితే.. వాటన్నింటినీ కీర్తి సురేశ్ సున్నితంగా ఖండించింది. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలపై మాత్రం కీర్తి కానీ, ఆమె కుటుంబసభ్యులు కానీ స్పందించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. త్వరలోనే ఈ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతున్నది. మరి కీర్తి సురేశ్ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం వస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

