ఎక్కడా తగ్గని పుష్పరాజ్ మీ ప్రేమకు తలొంచాడు
“బీహార్ ప్రజలకు నా ప్రణామాలు. ఎక్కడా తగ్గని పుష్పరాజ్ మీ ప్రేమకు తలొంచాడు. థ్యాంక్యూ పాట్నా. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2’.
“బీహార్ ప్రజలకు నా ప్రణామాలు. ఎక్కడా తగ్గని పుష్పరాజ్ మీ ప్రేమకు తలొంచాడు. థ్యాంక్యూ పాట్నా. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఆ స్థాయిలో ప్రేక్షకులు ఈ సినిమాను సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 5న సినిమా విడుదల కానుంది. మీ అంచనాలను మించి సినిమా ఉంటుంది” అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘పుష్ప 2’. రెండేళ్ల క్రితం విడుదలై, దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న “పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
బీహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా ‘పుష్ప 2’ ట్రైలర్‌ని కూడా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. ‘మీప్రేమను జీవితంలో మరిచిపోలేను. మీ అందరి అంచనాలను మించేలా సినిమా ఉంటుంది. డిసెంబర్ 5 కోసం మీలాగే నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఐలవ్యూ పాట్నా..’ అని కథానాయిక రష్మిక మందన్నా అన్నారు. ఇంకా నిర్మాతలు నవీన్ యర్నేని, వై.రవిశంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక ‘పుష్ప2’ ట్రైలర్ విషయానికొస్తే.. ‘ఎవడ్రా వీడు.. డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయంలేదు..’ అనే జగపతిబాబు డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ మోడ్‌లో సాగింది. డాన్‌గా మారిన పుష్పరాజ్‌ను ఈ ట్రైలర్లో చూడొచ్చు. భన్వరాల్ షకావత్గా ఫహాద్ ఫాజిల్ పాత్ర అత్యంత శక్తిమంతంగా ట్రైలర్లో ఆవిష్కృతమైంది. అంతేకాక, పుష్పరాజ్, శ్రీవల్లీల దాంపత్యం నేపథ్యంలో వచ్చే సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా మాస్ ఆడియన్స్ మెచ్చేలా ట్రైలర్ ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

