Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei ) ఆరోగ్యం క్షీణించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం కోమా (coma)లో ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఈ వార్తల నేపథ్యంలో ఖమేనీ తాజాగా బయటకొచ్చారు.
ఇరాన్ రాయబారితో భేటీ అయిన ఫొటోను ఖమేనీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. లెబనాన్‌లో ఇరాన్ రాయబారి మోజ్తాబా అమని (Mojtaba Amani)తో భేటీ అయినట్లు పర్షియన్లో భాషలో పోస్టు పెట్టారు. ఈ మేరకు ఫొటోను కూడా షేర్ చేశారు. కాగా, గతంలో ఇజ్రాయెల్ జరిపిన పేజర్ పేలుళ్లలో అమని గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయాలనుంచి ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఖమేనీకి వివరించారు.
ظهر امروز یکشنبه ۲۷ آبان ۱۴۰۳؛ دیدار و گفتوگو با آقای مجتبی امانی، سفیر جانباز جمهوری اسلامی ایران در لبنان pic.twitter.com/ctIRbi9bVA
— KHAMENEI.IR | فارسی 🇮🇷 (@Khamenei_fa) November 17, 2024
ఇరాన్ తదుపరి నేతగా ఖమేనీ తనయుడు!
కాగా, 85 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం విషమించడంతో ఆయన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆ దేశ తదుపరి నేతగా ఎన్నికైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయతుల్లా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, మరణానికి ముందే పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు మీడియా కథనాలను బట్టి తెలిసింది. మరోవైపు, మొజ్తబా తన తండ్రి జీవించి ఉండగానే ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయతొల్లా డిమాండ్ మేరకు సెప్టెంబరు 26న ఇరాన్ నిపుణుల సభ సమావేశమై.. తన వారసుడి ఎన్నికను అత్యంత రహస్యంగా ఉంచాలని సభ్యులకు అయతుల్లా నుంచి ఆదేశాలు వెళ్లాయని మీడియా కథనాలు నివేదించాయి. ఈ క్రమంలో ఆయన ఇప్పుడు బయటకు రావడంతో ఖమేనీ ఆరోగ్యంపై స్పష్టత వచ్చినట్లైంది.
Also Read..
నెతన్యాహూ ఇంటి పైకి ఫ్లాష్ బాంబులు
ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై విరుచుకుపడ్డ రష్యా
100 మందికి పైగా విదేశీయులకు ఉరి