Delhi Blast | ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ పేలుడుతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా తాజాగా సంచలన విషయం బయటపడింది. ఢిల్లీ పేలుళ్ల కుట్రదారులు సెకెండ్ హ్యాండ్ ఫోన్ల (second hand phones)ను ఉపయోగించినట్లు తేలింది.
కుట్రదారులు పొరుగుదేశం నేపాల్ (Nepal)లో ఏడు సెకెండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేసినట్లు విచారణలో గుర్తించారు. అలాగే దాదాపు 17 సిమ్ కార్డులను ఉపయోగించినట్లు తేలింది. అందులో ఆరు సిమ్ కార్డులను ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లోని బెకాన్‌గంజ్ అడ్రెస్‌తో తీసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు సిమ్ కార్డుకు ఇచ్చిన ఆధారాల ఆధారంగా భద్రతా అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.
వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో పలువురు వైద్యులను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్టైన డాక్టర్ పర్వేజ్ బావమరిది ఉస్మాన్ బెకాన్‌గంజ్‌లో బట్టల దుకాణం నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దాదాపు ఆరు గంటల పాటూ ఉస్మాన్‌ను విచారించారు. అయితే, అతడి నుంచి ఎలాంటి కీలక సమాచారం రాలేదని తెలిసింది. మరోవైపు డాక్టర్ పర్వేజ్ కాన్పూర్ వెళ్లినప్పుడు తన స్నేహితులను కలిసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కాన్పూర్‌లోని కల్నల్‌గంజ్, జీఎస్వీఎం మెడికల్ కాలేజీ, బాబుపూర్వా, మంధానాలోని స్నేహితులను కలిసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఇక ఢిల్లీ పేలుళ్లకు మాస్టర్ మైండ్ అయిన లేడీ డాక్టర్ షాహీన్ ఈ ఏడాది అక్టోబర్‌లో కాన్పూర్ వెళ్లినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. వారు ఎవరెవరిని కలిశారన్నదానిపై అధికారులు కూపీ లాగుతున్నారు.
Also Read..
PM Modi | సౌదీలో బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Digital Arrest | సీబీఐ అధికారులమంటూ.. మహిళ నుంచి రూ.32 కోట్లు కాజేసిన నేరగాళ్లు
Bomb Threats | సీఎం స్టాలిన్ సహా పలువురి నివాసాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు