Road Accident | ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. చంపా (Champa) జిల్లాలో ఓ కారు – ట్రక్కు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఎస్యూవీ కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జంజ్గిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుక్లి (Sukli) గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Smriti Mandhana | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన స్మృతి మంధాన తండ్రి.. పెళ్లి డేట్ ప్రకటిస్తారా..?
Mumbai Terror Attack | ముంబై మారణహోమానికి 17 ఏండ్లు
Nirmala Gavit | మాజీ ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లిన కారు