Bus Accident | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటు చేసుకుంది. తెహ్రీ (Tehri) జిల్లాలోని నరేంద్రనగర్ ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది (Bus fell into a deep gorge). ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కుంజాపురి-హిండోలఖల్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి 70 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 35 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Uttarakhand | Five passengers dead after a bus carrying around 28 passengers fell into a deep gorge near Kunjapuri–Hindolakhal under the Narendra Nagar area of Tehri district today, says SDRF. pic.twitter.com/p7RU6eGPnT
— ANI (@ANI) November 24, 2025
Also Read..
Lakshmi Mittal | పన్నుల సెగ.. బ్రిటన్‌కు స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ గుడ్‌బై..?
Delhi Airport | టేకాఫ్ రన్‌వేపై ల్యాండ్ అయిన విమానం.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం
Two Buses Collide | రెండు బస్సులు ఢీ.. ఎనిమిది మంది మృతి