Pawan Express | పవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
Pawan Express | బీహార్ (Bihar)లో ఓ రైలు (train)లో మంటలు చెలరేగాయి. ముంబై వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ (Pawan Express) రైలులో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి (Fire breaks out).
Pawan Express | బీహార్ (Bihar)లో ఓ రైలు (train)లో మంటలు చెలరేగాయి. ముంబై వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ (Pawan Express) రైలులో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి (Fire breaks out). అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బీహార్‌లోని మధుబని (Madhubani)లో గల జయనగర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ముంబై బయల్దేరడానికి ముందు సిబ్బంది రైలు కోచ్‌లను శుభ్రం చేస్తున్నారు. ఆ సమయంలో ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు, సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాద సమయంలో కంపార్ట్మెంట్స్లో ఉన్న కొందరు ప్రయాణికులు కిటికీల్లోంచి దూకి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.
#WATCH | Fire breaks out in an AC coach of Pawan Express train at Jaynagar in Bihar’s Madhubani; no casualties reported in the incident pic.twitter.com/QwnULqdCUi
— ANI (@ANI) December 15, 2023
Also Read..
Security Heightened | భద్రతా వలయంలో పార్లమెంట్ భవనం.. డేగ కళ్లతో పహారా కాస్తున్న సిబ్బంది
Bhajan Lal Sharma | రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

