Fire | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంధేరి (Andheri)లోని 18 అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగాయి. అంధేరి సబ్వే ఎదురుగా ఉన్న SV రోడ్లోని చండివాలా పెర్ల్ రీజెన్సీలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న నివాసితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Fire breaks out in 18-storey residential building in Andheri, Mumbai; fire-fighting operation underway: officials.
— Press Trust of India (@PTI_News) January 3, 2026
Also Read..
Viral Video | రెచ్చిపోయిన ఆకతాయిలు.. మద్యం మత్తులో నడిరోడ్డుపై కారుపైకెక్కి నృత్యాలు.. VIDEO
Priyanka Gandhi | కుమారుడి ఎంగేజ్మెంట్ వార్తలు.. స్పందించిన ప్రియాంక గాంధీ