Viral Video | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని నోయిడా (Noida)లో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. ఫుల్‌గా మద్యం సేవించి రద్దీ రహదారిపై కారుపైకెక్కి నృత్యాలు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ (traffic jam)కు అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన దృష్యాలను అక్కడే ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కొందరు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా (Viral Video) మారాయి.
డిసెంబర్ 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరుగురు యువకులు ఫుల్‌గా మద్యం సేవించి మారుతి ఆల్టో కారులో ప్రయాణించారు. మార్గం మధ్యలో కారు ఆపి దాని రూఫ్‌టాప్ పైకెక్కి నృత్యాలు చేశారు. వీరి చర్యతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న స్థానికులు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు రూ.67 వేలు జరిమానా విధించి షాకిచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Chaos in Noida NYE: 6 drunk youths danced on an Alto car’s roof, got caught. Police slapped ₹67,000 e-challan for public nuisance with strict warning.
pic.twitter.com/FRXlpryaDE— Ghar Ke Kalesh (@gharkekalesh) January 3, 2026
Also Read..
Priyanka Gandhi | కుమారుడి ఎంగేజ్మెంట్ వార్తలు.. స్పందించిన ప్రియాంక గాంధీ
Maoists Encounter | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి