Maoists Encounter | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించారు.
కిష్టారం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో కుంట ఏరియా కార్యదర్శి మంగడు మృతిచెందినట్లు తెలిసింది. ఘటనాస్థలిలో ఏకే 47, ఇన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బీజాపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.