Rajnath Singh | దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం (white collar terror threat) ఆందోళనకరంగా పెరుగుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. విలువలు లేని ఉన్నత విద్య సమాజానికి ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య అనేది వృత్తిపరమైన విజయం మాత్రమేకాదని వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని నోబుల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనను ప్రస్తావించారు. ఈ దాడిలో నిందితులు అర్హత కలిగిన వైద్యులు అని తెలిపారు. జ్ఞానంతో పాటు విలువలు, నైతికత ఎంత అవసరమో ఆ ఘటన తెలియజేస్తుందని చెప్పారు. ‘ఉన్నత విద్యావంతులు సమాజానికి, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బాంబు పేలుడుకు పాల్పడిన వారు వైద్యులు. వారి చేతిలో డిగ్రీ, జేబుల్లో ఆర్డీఎక్స్ ఉన్నాయి. జ్ఞానంతో పాటు విలువలు, నైతికత ఎంత అవసరమో ఆ ఘటన తెలియజేస్తుంది’ అని తెలిపారు.
Also Read..
Priyanka Gandhi | కుమారుడి ఎంగేజ్మెంట్ వార్తలు.. స్పందించిన ప్రియాంక గాంధీ
Maoists Encounter | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
Service Charge | 10 సర్వీస్ చార్జి తీసుకున్నందుకు.. ముంబైలోని రెస్టారెంట్‌కు 50 వేల జరిమానా