Priyanka Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రియాంక, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా (Raihan Vadra) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ప్రియాంక గాంధీ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలను ధృవీకరించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. రేహాన్‌కు తన చిన్ననాటి స్నేహితురాలు అవీవా బేగ్ (Aviva Baig)తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రకటించారు. ఈ మేరకు వారి ఫొటోలను కూడా ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. కాగా, వీరి ఎంగేజ్మెంట్ రాజస్థాన్ రణతంబోర్లో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో జరిగినట్లుగా తెలుస్తోంది.
Also Read..
Service Charge | 10 సర్వీస్ చార్జి తీసుకున్నందుకు.. ముంబైలోని రెస్టారెంట్‌కు 50 వేల జరిమానా
Gig Workers | 90 రోజులు పనిచేస్తేనే సామాజిక భద్రత.. గిగ్ వర్కర్లకు కేంద్రం మెలిక