శుక్రవారం 03 జూలై 2020
National - May 05, 2020 , 09:47:49

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 400 మంది వ‌ల‌స కూలీల‌పై కేసు

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 400 మంది వ‌ల‌స కూలీల‌పై కేసు

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని బ‌ర్వానీలోని సెంధ్వా ప్రాంతంలో జాతీయ ర‌హ‌దారిపై ఆదివారం వ‌ల‌స కూలీలు పోలీసుల‌పై రాళ్ళు విసిరిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు పోలీస్ అధికారుల‌కు గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి 400 మంది వ‌ల‌స కూలీల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు సెంధ్వా రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ఎస్ఐ రాజేంద్ర సోలంకి తెలిపారు.

లాక్ డౌన్ తో చిక్కుకునిపోయిన వ‌ల‌స కార్మికులు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించే క్ర‌మంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మ‌రోవైపు వ‌ల‌స‌కార్మికులు, కూలీల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపించేందుకు రైల్వే శాఖ స‌హ‌కారంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo