karnataka CM | బెంగళూరు, జనవరి 14: కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠంపై పోరు కొనసాగుతూనే ఉన్నది. పదవిని నిలబెట్టుకోవడానికి సిద్ధరామయ్య, ఆ స్థానాన్ని దక్కించుకోవాలని శివకుమార్ నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. అధికారం కోసం జరుగుతున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తెర దించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో సీఎం పీఠంపై మార్పు జరుగుతుందన్న ప్రచారంతో నిరంతరం గందరగోళం ఏర్పడుతున్నదని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరినట్టు తెలిసింది. తమిళనాడు నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాహుల్ మంగళవారం మైసూర్ ఎయిర్‌పోర్టులో సిద్ధరామయ్య, డీకేతో విడివిడిగా సమావేశమయ్యారు. వారి ముగ్గురి మధ్య ఏం చర్చలు జరిగాయో తెలియదు కానీ, రాజధానికి తిరిగి వచ్చిన తర్వాత యథాప్రకారం సీఎం పీఠంపై మళ్లీ ఊహాగానాలు, నర్మగర్భ ప్రకటనలు ప్రారంభమయ్యాయి. మరికొంత కాలం ఆగమంటూ డీకేకు రాహుల్ సూచించారని,త్వరలోనే ఢిల్లీకి పిలుస్తానని హామీనిచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రయత్నం వృథా అయినా..
రాహుల్‌ను కలిసి వచ్చిన తర్వాత డీకే ఎక్స్‌లో పెట్టిన ఒక సందేశం చర్చనీయాంశంగా మారింది. ‘ప్రయత్నం వృథా అయినా ప్రార్థన వృథా కాదు’ అంటూ ఆయన ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. అంతకుముందు రాహుల్‌తో సమావేశమైన అనంతరం డీకే మాట్లాడుతూ ‘నేను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఆయన (రాహుల్ గాంధీ) మాతో ఏం చర్చించారో అన్నీ ఇక్కడ మేం చెప్పలేం. ఆయనేం మాట్లాడారో మీరు ఊహించి ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి మాకు అలాంటి సందేశం ఏమీ రాలేదు. బాగా పనిచేయమని అన్నారు’ అని డీకే పేర్కొన్నారు.
ఎన్ఐఏ చీఫ్‌గా రాకేశ్ అగర్వాల్
మస్కట్ చేరుకున్న ఐఎన్ఎస్వీ ‘కౌండిన్య’