న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ అగర్వాల్ నియమితులయ్యారు. 2028 ఆగస్టు 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాకేశ్ అగర్వాల్ 1994 బ్యాచ్ హిమాచల్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఎన్ఐఏలో స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు బీఎస్ఎఫ్ చీఫ్‌గా 1993 బ్యాచ్ పశ్చిమబెంగాల్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్, ఐటీబీపీ చీఫ్‌గా 1990 బ్యాచ్ హర్యానా క్యాడర్ ఐపీఎస్ అధికారి శత్రుజీత్ సింగ్ కపూర్ నియమితులయ్యారు