Watch | ఫ్రూట్ మార్కెట్లో కొట్టుకున్న వ్యాపారులు.. వీడియో వైరల్
Viral Video | ఫ్రూట్ మార్కెట్లో పండ్ల వేలం సందర్భంగా ఇద్దరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరుగడంతో ఇది కాస్త ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల వ్యాపారులు దారుణంగా కొట్టుకున్నారు. ఖాళీగా ఉన్న ట్రేలు, కర్రలతో దాడులు చేసుకున్నారు.
సిమ్లా: ఒక ఫ్రూట్ మార్కెట్ (Fruit Market)లో కొందరు వ్యాపారులు ఘర్షణకు దిగారు. ఒకరిపై మరొకరు ట్రేలు, కర్రలతో కొట్టుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది (Viral Video). హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది. స్థానిక ఫ్రూట్ మార్కెట్లో పండ్ల వేలం సందర్భంగా ఇద్దరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరుగడంతో ఇది కాస్త ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల వ్యాపారులు దారుణంగా కొట్టుకున్నారు. ఖాళీగా ఉన్న ట్రేలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు పంచ్లు ఇచ్చుకున్నారు. చివరకు పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.
కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. 2021లో ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో ఇద్దరు చాట్ విక్రేతల మధ్య జరిగిన ఘర్షణ భారీ కోట్లాటకు దారి తీసిన సంఘటనను కొందరు గుర్తు చేశారు. తాజాగా సిమ్లా ఫ్రూట్ మార్కెట్ వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణను ‘బాగ్పత్ ఫైట్ 2.0’గా కొందరు వ్యవహరించారు. అయితే ఈ కోట్లాటలో అంత తీవ్రత లేదని, పోలీసులు చాలా ముందుగానే జోక్యం చేసుకున్నారంటూ ఒకరు వ్యాఖ్యానించారు.
Battle of Shimla Fruit Bazar. pic.twitter.com/0jg2LoTfAh
— News Arena India (@NewsArenaIndia) March 28, 2023
Also Read:
Office Chair | ఆఫీసులో కుర్చీ కోసం గొడవ.. సహోద్యోగిపై వ్యక్తి కాల్పులు
Dahi | పెరుగు ప్యాకెట్ల పేరును ‘దహీ’గా మార్చాలంటూ కేంద్ర సంస్థ ఆదేశం.. హిందీని రుద్దడంపై మండిపడిన స్టాలిన్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Baghpat
- fight
- fruit market
- Shimla
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

