Dahi | పెరుగు ప్యాకెట్ల పేరును ‘దహీ’గా మార్చాలంటూ కేంద్ర సంస్థ ఆదేశం.. హిందీని రుద్దడంపై మండిపడిన స్టాలిన్
Dahi | జాతీయ ఆహార భద్రతా సంస్థ జారీ చేసిన ఉత్తర్వుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. హిందీయేరత రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్య అని విమర్శించారు. పెరుగు ప్యాకెట్లను కూడా స్థానిక భాషల్లో కాకుండా హిందీలో లేబుల్ చేయాలంటూ నిర్దేశించే స్థాయికి చేరడం బలవంతంగా హిందీని విధించడమేనని దుయ్యబట్టారు.
చెన్నై: పెరుగు ప్యాకెట్ల పేరును ‘దహీ’ (Dahi) గా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆదేశించింది. అయితే హిందీయేతర రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాజాగా పాల సంఘాలు, పాల ఉత్పత్తిదారులకు ఒక ఉత్తర్వు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీష్‌లో కర్డ్‌గా లేదా స్థానిక భాషల్లో పేర్కొనే లేబుల్‌ను ఇకపై హిందీ భాషలో ‘దహీ’గా పేర్కోవాలని ఆదేశించింది. పాల పదార్థాలైన వెన్న, జున్ను ప్యాక్‌లను కూడా హిందీలోనే పేర్కోవాలని సూచించింది. బ్రాకెట్లలో స్థానిక భాషాల్లో పేర్లు ఉండవచ్చని పేర్కొంది.
కాగా, జాతీయ ఆహార భద్రతా సంస్థ జారీ చేసిన ఈ ఉత్తర్వుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. హిందీయేరత రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్య అని విమర్శించారు. పెరుగు ప్యాకెట్లను కూడా స్థానిక భాషల్లో కాకుండా హిందీలో లేబుల్ చేయాలంటూ నిర్దేశించే స్థాయికి చేరడం బలవంతంగా హిందీని విధించడమేనని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మాతృభాషలను నిర్వీర్యం, నిర్లక్ష్యం చేసేవారిని దక్షిణాది నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని ట్విట్టర్లో హెచ్చరించారు.
మరోవైపు కేంద్ర ఫుడ్ సేఫ్టీ సంస్థ జారీ చేసిన ఈ ఉత్తర్వును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై కూడా తప్పుపట్టారు. స్థానిక భాషలకు వ్యతిరేకంగా ఉన్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఒక లేఖలో కోరారు. తమిళనాడు, కర్ణాటకకు చెందిన పాల ఉత్పత్తిదారులు, పాల సంఘాలు కూడా దీనిపై తీవ్రంగా మండిపడ్డాయి. పెరుగును స్థానిక భాషలోనే పేర్కొంటామని ‘దహీ’గా హిందీలో లేబుల్స్‌పై ముద్రించబోమని స్పష్టం చేశాయి.
The unabashed insistences of #HindiImposition have come to the extent of directing us to label even a curd packet in Hindi, relegating Tamil & Kannada in our own states.
Such brazen disregard to our mother tongues will make sure those responsible are banished from South forever. https://t.co/6qvARicfUw pic.twitter.com/gw07ypyouV
— M.K.Stalin (@mkstalin) March 29, 2023
The notification released by FSSAI for the use of “Dhahi” in curd sachets produced by state-run cooperative societies is not in tandem with the policy of our Hon PM Thiru @narendramodi avl to promote regional languages.
We want an immediate rollback of the notification. pic.twitter.com/SKK18O59li
— K.Annamalai (@annamalai_k) March 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్‌కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

