Office Chair | ఆఫీసులో కుర్చీ కోసం గొడవ.. సహోద్యోగిపై వ్యక్తి కాల్పులు
Office Chair | ఆఫీస్‌లోని కుర్చీ కోసం అమన్ జాంగ్రా, విశాల్ మధ్య ఘర్షణ జరిగింది. కోట్లాట నేపథ్యంలో విశాల్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే అమన్ అతడ్ని అనుసరించాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న విశాల్‌పై గన్‌తో కాల్పులు జరిపాడు.
చండీగఢ్: ఆఫీసులో కుర్చీ (Office Chair) కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన సహోద్యోగిపై గన్‌తో కాల్పులు జరిపాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 44లో పైసాబజార్ సంస్థ కార్యాలయం ఉంది. అందులో పని చేసే ఇద్దరు ఉద్యోగుల మధ్య బుధవారం గొడవ జరిగింది. ఆఫీస్‌లోని కుర్చీ కోసం అమన్ జాంగ్రా, విశాల్ మధ్య ఘర్షణ జరిగింది. కోట్లాట నేపథ్యంలో విశాల్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే అమన్ అతడ్ని అనుసరించాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న విశాల్‌పై గన్‌తో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గన్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన విశాల్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే తీవ్రంగా గాయపడిన విశాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు అమన్ జాంగ్రా కోసం వెతుకున్నట్లు తెలిపారు. అతడిపై హత్యాయత్నంతోపాటు, ఆయుద్ధ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Wife elopes | ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య.. మామను కాల్చి చంపిన భర్త
Dirty MLA | అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూసిన బీజేపీ ఎమ్మెల్యే.. ఇలాంటి నేతనా మనం ఎన్నుకుంది అంటూ నెటిజన్లు ఫైర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

