Dirty MLA | అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూసిన బీజేపీ ఎమ్మెల్యే.. ఇలాంటి నేతనా మనం ఎన్నుకుంది అంటూ నెటిజన్లు ఫైర్
Jadav Lal Nath | త్రిపుర (Tripura )కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే ( BJP MLA) అసెంబ్లీ (Assembly) లో అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఎమ్మెల్యే తన ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ కనిపించాడు.
Dirty MLA | త్రిపుర (Tripura )కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే Jadav Lal Nath అసెంబ్లీ (Assembly) లో అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఎమ్మెల్యే తన ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి.
త్రిపురలోని బగ్బస్సా నియోజకవర్గానికి (Bagbassa constituency) ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ (Jadav Lal Nath).. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) జరుగుతున్న సమయంలో కుర్చీలో దర్జాగా కూర్చొని తన ఫోన్ (Mobile)లో అశ్లీల వీడియోలు (Porn Videos) చూస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. గౌరవప్రదమైన హోదాలో ఉండి ఇవేం పనులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టసభల్లో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిందిపోయి.. ఇలా అశ్లీల వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేతలనా మనం ఎన్నుకుంది..? అంటూ మండిపడుతున్నారు.
మార్చి 27వ తేదీన త్రిపుర అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను ఎవరో వెనుక నుండి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే తన ఫోన్లో కొన్ని వీడియో ఫీడ్ల ద్వారా స్క్రోలింగ్ చేస్తూ వీడియోలను చూస్తున్నట్లుగా ఉంది.
Also Read..
Indore Temple | రామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయంలోని మెట్లబావిలోకి పడిపోయిన భక్తులు
Suicide | తల్లిదండ్రులు చదువుకోమన్నందుకు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న 9 ఏండ్ల బాలిక
Anand Mahindra | ఫ్రిజ్ లేకుండానే ఐస్‌క్రీమ్ తయారు చేయొచ్చు.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Martin Cooper | మొబైల్ ఎలా వాడాలో ఇప్పటికీ నాకు తెలీదు.. సెల్‌ఫోన్ రూపకర్త మార్టిన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

