Martin Cooper | మొబైల్ ఎలా వాడాలో ఇప్పటికీ నాకు తెలీదు.. సెల్‌ఫోన్ రూపకర్త మార్టిన్
Martin Cooper | సెల్‌ఫోన్ వాడకంలో ఇప్పటికీ తనకు పూర్తి అవగాహన లేదని అంటున్నారు దాని రూపకర్త, ‘ఫాదర్ ఆఫ్ ది సెల్ ఫోన్’ (Father of the cell phone)గా పిలవబడే అమెరికన్ ఇంజనీర్ (American engineer) మార్టిన్ కూపర్(Martin Cooper).
Martin Cooper | సెల్ ఫోన్ (Cell Phone).. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరి చేతుల్లోనూ సెల్‌ఫోనే(cell phone) కనిపిస్తుంది. సెల్‌ఫోన్ లేకుండా ప్రజలు ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి. నిద్ర లేవడంతోనే ముందుగా సెల్‌ఫోన్‌తోనే తమ రోజును మొదలు పెడుతున్నారు. అయితే, సెల్‌ఫోన్ వాడకంలో ఇప్పటికీ తనకు పూర్తి అవగాహన లేదని అంటున్నారు దాని రూపకర్త, ‘ఫాదర్ ఆఫ్ ది సెల్ ఫోన్’ (Father of the cell phone)గా పిలవబడే అమెరికన్ ఇంజనీర్ (American engineer) మార్టిన్ కూపర్(Martin Cooper). సెల్‌ఫోన్ కనిపెట్టిన తనకి ఇప్పటికీ చాలా విషయాలు తెలియవని చెప్పారు.
దాదాపు 50 ఏండ్ల క్రితం మార్టిన్ కూపర్ (Martin Cooper) సెల్ ఫోన్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆయన వయసు 94 ఏండ్లు. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మార్టిన్ ప్రపంచం సెల్‌ఫోన్ వాడుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘సెల్ ఫోన్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే వాటి వాడకం కాస్త శ్రుతిమించినట్లు అనిపిస్తోంది. చాలా మంది ఫోన్లో మునిగిపోయి పక్కన ఎవరున్నారన్నది కూడా మర్చిపోతున్నారు. ఫోన్లో లీనమైపోయి రోడ్డు దాటుతున్న వారిని నేను రోజూ చూస్తూ ఉంటాను. సెల్ ఫోన్ ఈ స్థాయిలో ప్రజల జీవితంతో పెనవేసుకుపోతుందని నేను అస్సలు అనుకోలేదు’ అని అన్నారు.
‘ప్రపంచం సెల్‌ఫోన్ వాడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సామాజిక మాధ్యమాలకు ఎక్కువ మంది బానిసలు కావడం కూడా ఆందోళన కలిగించే అంశమే. యూజర్లు సెల్ఫోన్ల వాడకంపై సమయాన్ని తగ్గించి సాధారణ జీవనంపై దృష్టి సారించాలి. పిల్లలను సెల్ఫోన్లకు బానిసలను చేయడం మంచి పద్ధతి కాదు. సెల్ ఫోన్ వాడకం విషయంలో ఇప్పటికీ నాకు సరైన అవగాహన లేదు. నా మనవళ్లు, మనవారళ్లు సెల్ఫోన్లు వాడుతున్నట్లు నేను వాడలేను. ఫోన్‌ను ఇతరులతో మాట్లాడేందుకు మాత్రమే వాడుతుంటాను’ అని మార్టిన్ వెల్లడించారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫోన్‌ను మార్టిన్ కూపర్ తయారు చేశాడు. అతను 1973 ఏప్రిల్ 3న ప్రపంచం ముందు ప్రదర్శించాడు.
Also Read..
Rahul Gandhi | ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి.. రాహుల్ అంశంపై జర్మనీ
India Corona | మూడు వేలు దాటిన కొత్త కేసులు.. 14 మంది మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

