Pakistan Twitter Account | భారత్‌లో పాక్ అధికారిక ట్విట్టర్ ఖాతా నిలిపివేత.. 6 నెలల్లో ఇది రెండోసారి
Pakistan Twitter Account | పాకిస్థాన్ (Pakistan)కు భారత్ (India)లో భారీ షాక్ తగిలింది. ఆ దేశ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా (Twitter Account) ట్విట్టర్ ఇండియా నిలిపివేసింది. లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే గురువారం నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విట్టర్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.
Pakistan Twitter Account | పాకిస్థాన్ (Pakistan)కు భారత్ (India)లో భారీ షాక్ తగిలింది. ఆ దేశ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా (Twitter Account) ట్విట్టర్ ఇండియా నిలిపివేసింది. లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే గురువారం నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విట్టర్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సరైన కారణాన్ని ఇప్పటి వరకు ట్విటర్ (Twitter) వెల్లడించలేదు. భారత్‌లో ఉన్నవారు @GovtofPakistan ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించగా.. ‘అకౌంట్ విత్‌హెల్డ్’ (Account withheld) అని చూపిస్తోంది. కాగా భారత్‌లో పాక్ ట్విట్టర్ ఖాతా నిలిపివేయడం ఆరు నెల్లలోనే ఇది రెండోసారి.
అయితే, ఈ విషయంపై భారత్, పాకిస్థాన్ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా (government Twitter handle) ను భారతదేశంలో చూడకుండా బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోని నోటీసుల ప్రకారం వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. కంపెనీ మార్గదర్శకాలు, కోర్టు ఆర్డర్ వంటి చెల్లుబాటు అయ్యే చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ట్విట్టర్ పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసినట్లు పేర్కొంది. కాగా, అమెరికా, కెనడా వంటి ఇతర దేశాల్లో పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా పనిచేస్తోంది.

Pak Twitter 2
భారత్‌లో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ట్విటర్ ఖాతా బ్లాక్ అయింది. 2022 జులై, అక్టోబరు నెలల్లో ట్విటర్ ఖాతాను భారత్‌లో నిషేధించడం జరిగింది. అయితే కొన్ని నెలల తర్వాత మళ్లీ తిరిగి పునరుద్దరించారు. తాజాగా మూడోసారి భారతదేశంలో పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా నిలిచిపోయింది.
గతంలో భారతదేశంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఉద్దేశంతో పాకిస్థాన్‌కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్బుక్ ఖాతాలను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్విటర్ నిర్ణయం వల్ల.. భారత్‌లో ఉన్న వారు పాకిస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో ఎటువంటి సమాచారాన్ని చూడటానికి అవకాశం లేకుండా పోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

