Suicide | తల్లిదండ్రులు చదువుకోమన్నందుకు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న 9 ఏండ్ల బాలిక
Suicide | తల్లిదండ్రులు (Parents) చదువుకోమని చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ తొమ్మిదేండ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఉరివేసుకుని (hanging) ఆత్మహత్య (died by suicide) చేసుకుంది.
Suicide | తల్లిదండ్రులు (Parents) చదువుకోమని చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ తొమ్మిదేండ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఉరివేసుకుని (hanging) ఆత్మహత్య (died by suicide) చేసుకుంది. ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం తిరువళ్లూర్ (Thiruvallur ) జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
స్థానికంగా నివాసం ఉండే కృష్ణమూర్తికి తొమ్మిదేండ్ల కుమార్తె ఉంది. తను ఇన్స్టాగ్రామ్ (Instagram)లో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ.. రకరకాల రీల్స్‌తో సందడి చేస్తుంటుంది. దీంతో చుట్టుపక్కల వారంతా బాలికను ‘ఇన్‌స్టా క్వీన్’ (Insta Queen) గా పిలుస్తుంటారు. కాగా, సోమవారం రాత్రి బాలిక తన బంధువుల ఇంటి దగ్గర స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు.. బాలికను ఇంటికెళ్లి చదువుకోమని చెప్పి ఇంటి తాళాలు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. అనంతరం ఏదో పనిమీద వారు బయటకు వెళ్లారు.
దీంతో మనస్తాపం చెందిన బాలిక.. ఇంటికెళ్లి కిటికీ చువ్వకు తువ్వాలతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దాదాపు గంట తర్వాత ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు.. తలుపు తీయాలని కుమార్తెను కోరారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో డోర్ బద్దలు కొట్టి లోపలికెళ్లి చూడగా.. అచేతన స్థితిలో ఉన్న కుమార్తె కనిపించింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
Also Read..
Anand Mahindra | ఫ్రిజ్ లేకుండానే ఐస్‌క్రీమ్ తయారు చేయొచ్చు.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Rahul Gandhi | ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి.. రాహుల్ అంశంపై జర్మనీ
Martin Cooper | మొబైల్ ఎలా వాడాలో ఇప్పటికీ నాకు తెలీదు.. సెల్‌ఫోన్ రూపకర్త మార్టిన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

