Wife elopes | ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య.. మామను కాల్చి చంపిన భర్త
Wife elopes | ఆగ్రహించిన ఆమె భర్త బుధవారం అంబాద్లోని శారదా నగర్లో నివసిస్తున్న మామ ఇంటికి వచ్చాడు. అతడి కుమార్తె మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంపై నిలదీశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.
ముంబై: ఒక వ్యక్తి భార్య తన ప్రియుడితో కలిసి పారిపోయింది (Wife elopes). ఈ వ్యవహారంపై ఆగ్రహించిన భర్త, తుపాకీతో కాల్పులు జరిపి మామను హత్య చేశాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పైఠాన్లోని అడోల్కు చెందిన ఒక వ్యక్తి భార్య తన ప్రియుడితో కలిసి ఔరంగాబాద్కు పారిపోయింది. దీంతో ఆగ్రహించిన ఆమె భర్త బుధవారం అంబాద్లోని శారదా నగర్లో నివసిస్తున్న మామ ఇంటికి వచ్చాడు. అతడి కుమార్తె మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంపై నిలదీశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.
కాగా, ఆ వ్యక్తి ఆగ్రహంతో తుపాకీతో మామపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు మరణించాడు. అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Suicide | తల్లిదండ్రులు చదువుకోమన్నందుకు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న 9 ఏండ్ల బాలిక
Indore Temple | రామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయంలోని మెట్లబావిలోకి పడిపోయిన భక్తులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

