Farooq Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir)లోని గందర్బల్ (Ganderbal) జిల్లాలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిని (terror attack) నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) తీవ్రంగా ఖండించారు. పాక్ ఉగ్రవాదాన్ని భారత్‌లోకి ఎగదోయడాన్ని ఆపేయాలని హెచ్చరించారు. ఢిల్లీతో సత్సంబంధాలు కావాలంటే ఉగ్రవాద చర్యలకు పాక్ స్వస్తి పలకాలని హితవు పలికారు.
సోమవారం శ్రీనగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘భారత్‌తో సత్సంబంధాలు కావాలంటే.. ఉగ్రవాదానికి ముగింపు పలకాలని నేను పాకిస్థాన్ (Pakistan) నాయకత్వానికి చెప్పాలనుకుంటున్నాను. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌లో భాగం కాదు. కశ్మీర్ ప్రజలుగా మేం గౌరవంగా బతికి.. విజయం సాదిస్తాం. 75 ఏళ్లుగా ఉగ్రవాదం లేని పాకిస్థాన్‌ను సృష్టించలేకపోతే.. ఇప్పుడు అది ఎలా సాధ్యం అవుతుంది? ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది.
లేకపోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా అమాయక ప్రజలను చంపితే చర్చలు జరుగుతాయా..? ఈ దాడి చాలా దురదృష్టకరం. వలస వచ్చిన పేద కార్మికులు, ఒక వైద్యుడు తమ ప్రాణాలను కోల్పోయారు. దీని వల్ల ఉగ్రవాదులకు ఏం లాభం చేకూరుతుంది..? వారు కశ్మీర్‌ను పాకిస్థాన్‌లా మార్చాలని భావిస్తున్నారా.. ? కానీ, మేము ఉగ్రవాదాన్నే అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. తద్వారా మేము కష్టాల నుండి ముందుకు సాగొచ్చు’ అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
కాగా, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కార్మికులే లక్ష్యంగా మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం గందేర్బల్ జిల్లా గగన్‌గిర్ వద్ద నిర్మాణరంగ కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వైద్యుడు, మరో ఆరుగురు వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం కూడా సోఫియాన్ జిల్లాలో ఓ బీహారీ కార్మికుడ్ని ఉగ్రవాదులు కాల్చిచంపారు. తాజా ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరాయుధలైన అమాయక పౌరుల్ని హత్య చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..
Dharma Productions | కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్‌లో 50 శాతం వాటాలు కొనుగోలు చేసిన సీరమ్ సీఈవో
Metro Station | మెట్రో స్టేషన్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం