బుధవారం 27 జనవరి 2021
National - Nov 29, 2020 , 14:36:56

అమిత్ షా ఆఫ‌ర్‌కు నో చెప్పిన రైతులు

అమిత్ షా ఆఫ‌ర్‌కు నో చెప్పిన రైతులు

న్యూఢిల్లీ:  మీరు మీ ఆందోళ‌న‌ల‌ను బురారీ ప్రాంతానికి మార్చండి.. ప్ర‌భుత్వం వెంట‌నే మీతో చ‌ర్చ‌లు జ‌రుపుతుంద‌న్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫ‌ర్‌ను పంజాబ్‌కు చెందిన 30 రైతు సంఘాలు తిరస్క‌రించాయి. వ‌రుస‌గా నాలుగో రోజు కూడా కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. సింఘు, టిక్రీ ప్రాంతాల్లో రైతులు నిర‌స‌న తెలుపుతున్నారు. రైతుల ఆందోళ‌న‌తో ఢిల్లీకి వ‌చ్చే చాలా దారులు మూసుకుపోవ‌డంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతుల‌కు ఓ ఆఫ‌ర్ ఇచ్చారు. మీరు ప్ర‌భుత్వం చెప్పిన చోట ఆందోళ‌న‌లు నిర్వ‌హించండి.. మ‌రుస‌టి రోజే మీతో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని షా అన్నారు. దీనిపై ఆదివారం ఉద‌యం నుంచి స‌మాలోచ‌న‌ల‌ను జ‌రిపిన రైతు సంఘాల నేత‌లు.. చివ‌రికి ఆ ఆఫ‌ర్‌కు నో చెప్పారు. డిసెంబ‌ర్ 3న ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల కోసం ఇప్ప‌టికే కొన్ని సంఘాల నేత‌ల‌ను ఆహ్వానించిన‌ట్లు కూడా అమిత్ షా తెలిపారు. అయితే వెంట‌నే చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని వాళ్లు డిమాండ్ చేయ‌డంతో మీరు ఆందోళ‌న‌ను మేము చెప్పిన చోట నిర్వ‌హించాల‌ని షా అన్నారు. 


logo