Explosion | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ పేలుడు (Explosion) సంభవించింది. ప్రశాంత్ విహార్ (Prashant Vihar) ప్రాంతంలోని పీవీఆర్ (PVR) మల్టీప్లెక్స్ సమీపంలో గల ఓ స్వీట్ షాప్లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
గురువారం ఉదయం 11:48 గంటల సమయంలో స్వీట్ షాప్ వద్ద పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ప్రమాద స్థలిలో తెల్లటి పొడి లాంటి పదార్థం దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
PM Modi | ప్రధాని మోదీ హత్యకు ప్లాన్ అంటూ బెదిరింపు కాల్.. అప్రమత్తమైన పోలీసులు
Delhi | ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఈ సీజన్లో అత్యంత శీతల పరిస్థితులు
Maharashtra | సీఎం పీఠంపై స్పష్టత..! షిండేసేనకు 12, అజిత్ వర్గానికి 9 మంత్రి పదవులు..?