Rahul Gandhi | సెప్టెంబర్‌లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక..?
Rahul Gandhi | నేరపూరిత పరువునష్టం కేసు(criminal defamation)లో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ (Kerala)లోని వయనాడ్ (Wayanad) స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి తర్వలో ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Rahul Gandhi | నేరపూరిత పరువునష్టం కేసు(criminal defamation)లో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ (Kerala)లోని వయనాడ్ (Wayanad) స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి తర్వలో ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ (Pm Modi) ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గానూ.. బీజేపీ నేతలకు కోర్టుకు వెళ్లారు. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో విచారణ జరిపిన గుజరాత్‌లోని సూతర్ కోర్టు (Surat Court) రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. కోర్టు తీర్పుతో రాహుల్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
కాగా, ప్రజాప్రాతినధ్య చట్టం 2015లోని సెక్షన్ 151(ఏ) ప్రకారం.. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఆ స్థానం ఖాళీ అయిన ఆరు నెలలోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో రాహుల్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్ స్థానానికి నిబంధలన ప్రకారం సెప్టెంబర్ 23లోపు ఉప ఎన్నిక జరగాలి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌లో ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అయితే, సూరత్ కోర్టు (Surat Court) తీర్పుపై కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయిస్తోంది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్8(3)(Section8(3) of Representatives of Peoples Act )ను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆటోమెటిక్‌గా ప్రజాప్రతినిధుల్ని అనర్హులుగా ప్రకటించే సెక్షన్ 8 విషయంలో దిశానిర్దేశం చేయాలని సుప్రీంను ఆ పిటిషన్లో కోరారు. ఆ సెక్షన్ అక్రమంగా, ఏకపక్షంగా ఉందని పిటిషన్లో ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్యచట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును పిటీషనర్లు ప్రశ్నించారు. ఈ పిటిషన్‌పై రాహుల్‌కు అనుకూలంగా సుప్రీం తీర్పు ఇస్తే ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాల్సి ఉంటుంది. వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక కూడా అవసరం ఉండదు. ఆ స్థానానికి ఎంపీగా రాహులే కొనసాగుతారు.
2004 నుంచి 2019 వరకు యూపీలోని అమేఠీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీ, వయనాడ్ స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే, అమేఠీలో బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక రెండో స్థానమైన వయనాడ్‌లో ఆయన గెలిచారు.
కాగా తాజా ఖాళీతో కలిపి ఇప్పుడు లోక్‌సభలో ఖాళీల సంఖ్య మూడుకు పెరిగింది. ఇప్పటికే ఖాళీ అయిన జలంధర్, లక్ష్యద్వీప్ స్థానాలకు వయనాడ్ జత కలిసింది. కాంగ్రెస్ సభ్యుడు సంతోఖ్‌సింగ్ చౌదరి ఆకస్మిక మరణంతో పంజాబ్‌లోని జలంధర్ స్థానం ఖాళీ కాగా, ఎన్సీపీ సభ్యుడు మహహ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటు పడటంతో లక్ష్యద్వీప్ స్థానం ఖాళీ అయింది.
Also Read..
Section 8 (3): ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3)ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
Mark Zuckerberg | మూడోసారి తండ్రైన మార్క్ జుకర్‌బర్గ్.. ఫొటో షేర్ చేసిన మెటా సీఈవో
Karnataka Assembly Elections | 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదలచేసిన కాంగ్రెస్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

