PCB : మహిళల ఆసియా కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇటీవల శ్రీలంక పర్యటనకు దూరమైన ఫాతిమా సనా(Fatima Sana)కు కెప్టెన్సీ అప్పగిస్తూ 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. దుబాయ్‌లో ఆగస్టు 28 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో సీనియర్లు మునీబా అలీ, గుల్ ఫిరోజ్, తుబా హసన్ కీలకం కానున్నారు. అలానే సెప్టెంబర్‌లో మొదలయ్యే ఆసియా క్రీడల్లో కూడా పాక్ బృందానికి ఫాతిమానే సారథ్యం వహించనుంది.
‘ది హండ్రెడ్ లీగ్’ కోసం శ్రీలంక పర్యటనకు దూరమైన ఫాతిమా సనా తిరిగి కెప్టెన్సీ చేపట్టనుంది. ఆసియా కప్, ఆసియా క్రీడల్లో పాక్ మహిళల జట్టును నడిపించనుందీ పేస్ ఆల్‌రౌండర్. ఆసియా కప్‌తో పాటు ఆసియా క్రీడల కోసం ఆదివారం పాక్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. అహేషా జఫర్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, నష్ర సంధు, షవాల్ జుల్ఫీకర్లు.. రెండు టోర్నీలకు ఎంపికయ్యారు. ఇక ఆసియా కప్ కోసం నలుగురిని, ఆసియా క్రీడల కోసం ఐదుగురిని రిజర్వ్ ప్లేయర్లుగా తీసుకుంది పీసీబీ.
Fatima Sana will lead Pakistan’s 15-member squads for the Asia Cup and Asian Games 🏏https://t.co/OFbj6K1e1q
— ICC (@ICC) August 16, 2026
ఆసియా కప్ స్క్వాడ్ : ఫాతిమా సనా(కెప్టెన్), అయేషా జఫర్, ఎమాన్ నసీర్, ఎమన్ ఫాతిమా, గుల్ ఫెరోజా, మొమినా రియాసత్, మునీబా అలీ(వికెట్ కీపర్), నజిహ అల్వీ, నష్రా సంధు, సదియా ఇక్బాల్, సైరా జబీన్, షవాల్ జుల్ఫీకర్, తుబా హసన్, ఉమ్ ఎ హనీ, వహీదా అక్తర్.
రిజర్వ్ ప్లేయర్లు – తస్మియా రుబాబ్, హుమ్నా బిలాల్, మహమ్ అనీస్, సదాఫ్ షమాస్.
ఆసియా గేమ్స్ స్క్వాడ్ : ఫాతిమా సనా(కెప్టెన్), అలియా రియాజ్, అయేషా జఫర్, ఎమాన్ నసీర్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫెరోజా, హుమ్నా బిలాల్, మమొనా రియాసత్, మునీబా అలీ(వికెట్ కీపర్), నష్రా సంధు, సైరా జబీన్, షవాల్ జుల్ఫికర్, తస్మియా రుబాబ్, ఉమ్ ఎ హనీ.
రిజర్వ్ ప్లేయర్లు – నటాలియా పర్వేజ్, వహీదా అక్తర్, సదియా ఇక్బాల్, సైదా అరూబ్ షా, రమీన్ షమీమ్.