Mark Zuckerberg | మూడోసారి తండ్రైన మార్క్ జుకర్‌బర్గ్.. ఫొటో షేర్ చేసిన మెటా సీఈవో
Mark Zuckerberg | ఫేస్బుక్ (Facebook) సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) మూడో సారి తండ్రయ్యాడు. ఆయన భార్య ప్రిస్కిలా చాన్ ( Priscilla Chan) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Mark Zuckerberg | ఫేస్బుక్ (Facebook) సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) మూడో సారి తండ్రయ్యాడు. ఆయన భార్య ప్రిస్కిలా చాన్ ( Priscilla Chan) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఈ జంటకు మూడోసారి కూడా అమ్మాయే పుట్టడం పట్ల జుకర్ బర్గ్ (Mark Zuckerberg) సంతోషం వ్యక్తం చేశారు. తన కుమార్తె పేరు అరేలియా చాన్ జుకర్ బర్గ్ (Aurelia Chan Zuckerberg) అని వెల్లడించారు. ‘ప్రపంచంలోకి స్వాగతం అరేలియా చాన్ జూకర్ బర్గ్ (Aurelia Chan Zuckerberg)’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు కుమార్తెను మురిపెంగా చూస్తున్న ఫోటో షేర్ చేశారు.
కొత్త ఏడాది సందర్భంగా జుకర్‌బర్గ్ తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. 2023 ఏడాదిలో తమ జీవితాల్లోకి ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి రాబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ.. తన భార్య ప్రిస్కిలా చాన్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సైతం షేర్ చేశారు.
హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో మార్క్ జుకర్‌బర్గ్, ప్రిస్కిల్లా చాన్ మధ్య ప్రేమ చిగురించింది. ఇది కాస్తా ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. 2012 మే 19న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంటకు 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత ఆగస్టు 2017లో మరో పాప ‘ఆగస్ట్’ జన్మించింది. ఇప్పుడు మరో అమ్మాయికి జుకర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు.
Also Read..
Akshay Kumar | షూటింగ్లో అక్షయ్‌కుమార్‌కు గాయాలు
Depression | డిప్రెషన్‌గా ఫీలవుతున్నారా? రోజుకు 15 నిమిషాలు ఇలా చేయండి
Gold Price | బంగారం ధరలు భారీగా పెరగడంతో పాత నగలు అమ్మేసుకుంటున్న జనాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

