Gold Price | బంగారం ధరలు భారీగా పెరగడంతో పాత నగలు అమ్మేసుకుంటున్న జనాలు
Gold Price | బంగారం ధర ఒక్క ఉదుటన రూ.60,000 స్థాయిని చేరిన నేపథ్యంలో పాత పుత్తడి ఆభరణాల అమ్మకాలు జోరుగా పెరిగాయి. ఉగాది, గుడిపౌర్వ, నవరాత్రి తదితర పండుగలతో దేశీయంగా కొత్త సంవత్సరం ఆరంభమైన బుధవారం ఈ అమ్మకాలు పెరిగాయని జ్యువెలర్లు తెలిపారు.
Gold Price | న్యూఢిల్లీ, మార్చి 24: బంగారం ధర ఒక్క ఉదుటన రూ.60,000 స్థాయిని చేరిన నేపథ్యంలో పాత పుత్తడి ఆభరణాల అమ్మకాలు జోరుగా పెరిగాయి. ఉగాది, గుడిపౌర్వ, నవరాత్రి తదితర పండుగలతో దేశీయంగా కొత్త సంవత్సరం ఆరంభమైన బుధవారం ఈ అమ్మకాలు పెరిగాయని జ్యువెలర్లు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది పాత ఆభరణాల అమ్మకాలు 25 శాతం మేర అధికంగా జరిగాయన్నారు. అమ్మకాలు ఊపందుకోవడానికి రికార్డు ధరే కారణమని వివరించారు.
సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలలు పన్ను ఆదా పత్రాలపై దృష్టి ఉంటుందని, దాంతో ఈ నెలల్లో పుత్తడి కొనుగోళ్లు తగ్గుతాయని రిద్ధిసిద్ధి బులియన్ ఎండీ పృథ్వీరాజ్ కొఠారి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున పన్ను ఆదా పత్రాల్లో మదుపు చేసేందుకు ఈ సీజన్లో ప్రజలు బంగారాన్ని సొమ్ము చేసుకున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని, దీనికి అధిక ధరే కారణమని వెల్లడించారు. పిల్లల విద్యా వ్యయాల కోసం కూడా కొంతమంది పాత ఆభరణాల్ని విక్రయిస్తున్నారని అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- gold
- Gold Price
- gold rates
- jewelers
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

