Akshay Kumar | షూటింగ్లో అక్షయ్‌కుమార్‌కు గాయాలు
Akshay Kumar | అక్షయ్‌కుమార్, టైగర్‌ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘బడే మియా ఛోటే మియా’. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం స్కాట్లాండ్లో చిత్రీకరణ జరుపుకున్నది. హీరోలిద్దరిపై యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించారు.
Akshay Kumar | అక్షయ్‌కుమార్, టైగర్‌ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘బడే మియా ఛోటే మియా’. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం స్కాట్లాండ్లో చిత్రీకరణ జరుపుకున్నది. హీరోలిద్దరిపై యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించారు. స్టంట్స్ పర్ఫార్మ్ చేసే క్రమంలో అక్షయ్‌కుమార్ మోకాలికి తీవ్ర గాయమైందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.
అయితే బాధలోనే ఆయన షూటింగ్ పూర్తి చేశారని, ముందస్తుగా ఖరారైన షెడ్యూల్ దృష్ట్యా చిత్రీకరణను పొడిగించలేకపోయామని నిర్మాత జాకీ భగ్నానీ తెలిపారు. గాయం కారణంగా యాక్షన్ సీక్వెన్స్‌కు బ్రేక్‌నిచ్చి అక్షయ్‌కుమార్‌పై కొన్ని క్లోజప్ సీన్లను షూట్ చేశామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రంలో దక్షిణాది అగ్రహీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

