Karnataka Assembly Elections | 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదలచేసిన కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections)త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress) పార్టీ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను (first list) విడుదల చేసింది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections)త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress) పార్టీ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను (first list) విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య (Siddaramaiah), పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) కూడా ఉన్నారు. సిద్ధ రామయ్య.. వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా, శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.

కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువుకన్నా ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కాగా, 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకుంది. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకున్నాయి. ఒక ఇండిపెండెంట్ సైతం గొలుపొందారు. 2019లో జేడీఎస్తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులకే బీజేపీ కుట్రచేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చింది. దాంతో ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. బీజేపీ రెబెల్స్ బెడదను ఎదుర్కొంటున్నది.
Congress party announces the first list of 124 candidates for Karnataka Assembly Elections.
Names of former CM Siddaramaiah, and State party president DK Shivakumar are present in the first list. pic.twitter.com/TC9vXJfrX5
— ANI (@ANI) March 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

