Mrunal Thakur | టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో డెకాయిట్ (Dacoit) సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. షనీల్ డియో కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. మేకర్స్ ఫైనల్‌గా ఈ మూవీని ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి క్రేజీ అప్డేట్ షేర్ చేసింది మృణాళ్ ఠాకూర్. డెకాయిట్ ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేసేందుకు తాను హైదరాబాద్‌కు వెళ్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోర్షన్‌తో మృణాళ్ ఠాకూర్‌కు సంబంధించిన పార్ట్ పూర్తి కానుంది. హైదరాబాద్ పిలుస్తోంది.. అంటూ మృణాళ్ ఠాకూర్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రకాశ్ రాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
డెకాయిట్ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అడివిశేష్ హీరోగా నటించిన క్షణం, గూఢచారి చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన షనీల్ డియో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌పై సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
