Eknath Shinde | మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీసే ఖాయంగా తెలిసింది. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే (Eknath Shinde).. డిప్యూటీ సీఎంగా (Deputy Chief Minister) బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
డిసెంబర్ 5న ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని సదరు వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేస్తారని సదరు వర్గాలు తెలిపాయి. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంటోంది.
కాగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (Mahayuti) కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే సేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీసే (Devendra Fadnavis) మహా తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అయితే, ఇందుకు షిండే వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ కారణంగానే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read..
Om Birla | వాయిదాలు కొనసాగితే వారాంతాల్లోనూ సమావేశాలు ఉంటాయ్.. ఎంపీలను హెచ్చరించిన స్పీకర్
Chinmoy Krishna Das: హాజరుకాని డిఫెన్స్ లాయర్.. కృష్ణదాస్ బెయిల్ విచారణ వాయిదా