Ram Mandir | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల రామ మందిరం (Ayodhya Ram temple) సముదాయంలో పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న సూర్య మందిరం, గణేష్ మందిరం, శివ మందిరం, దుర్గా మందిరం, అన్నపూర్ణ మందిర్, హనుమాన్ మందిర్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు నిర్మాణాలకు సంబంధించిన చిత్రాలను ఆలయ ట్రస్ట్ (Ram Mandir trust) తాజాగా విడుదల చేసింది.
श्री राम जन्मभूमि मन्दिर में श्रीराम लला के विराजमान होने को एक वर्ष का समय होने वाला है। श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ने प्रतिष्ठा द्वादशी समारोह पूर्वक मनाने की योजना-रचना तैयार की है।
इसी के साथ ही मन्दिर निर्माण के शेष कार्य में भरपूर तेज़ी आई है। परकोटे में निर्माणाधीन… pic.twitter.com/wWiZuGhSyR
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 2, 2024
కాగా, ఆలయ నిర్మాణాన్ని 2025 జూన్‌కు పూర్తి చేయాలని ముందుగా నిర్ణయించారు. కానీ, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు సెప్టెంబర్ 2025 వరకు పూర్తి కానున్నట్లు కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మెన్ న్రుపేంద్ర మిశ్రా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. వర్కర్ల కొరత, బండల పని పూర్తి కాని నేపథ్యంలో.. ఆలయ శిఖర నిర్మాణంలో ఆలస్యం అవుతున్నట్లు చెప్పారు. సుమారు 200 మంది కార్మికులు షార్టేజ్ ఉన్నట్లు ఆయన తెలిపారు.
श्री राम जन्मभूमि मन्दिर के शिखर निर्माण का कार्य भी पूर्णता की ओर है। निर्माण की प्रगति अब स्पष्ट परिलक्षित होने लगी है।
The construction work of Shri Ram Janmabhoomi Mandir’s shikhar is also reaching completion . The progress of the construction has become increasingly… pic.twitter.com/65G3NiRVmD
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 2, 2024
కాగా, ఈ ఏడాది జనవరి 22న రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని ట్రస్ట్ నిర్ణయించింది. అయితే, పౌష్ శుక్ల ద్వాదశి కారణంగా జనవరి 22న కాకుండా 11న ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
Also Read..
PV Sindhu | సింధుకు కాబోయే భర్త ఎవరు..? ఐపీఎల్‌తో అనుబంధం.. ఆసక్తికర విషయాలు మీకోసం
Medical Students | ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
Samajwadi Party: నిన్న తృణమూల్, ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ.. కాంగ్రెస్ నిరసనకు దూరం