న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్ఎఫ్సీ)లో వాటా విక్రయానికి మదుపరుల నుంచి స్పందన కరువైంది. రెండు శాతం వాటా విక్రయానికి సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు కంపెనీకి చెందిన 23.52 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించగా, దీనికి 22.34 కోట్ల షేర్లకు బిడ్డింగ్ దాఖలైంది.
జారీ చేసిన దాంట్లో 94.98 శాతం మాత్రమే బిడ్డింగ్లు వచ్చాయి. షేరు ధర రూ.104.12గా నిర్ణయించింది. మొత్తంగా బిడ్డింగ్ల విలువ రూ.2,326 కోట్లుగా ఉన్నది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం గురువారం షేర్లను విక్రయించనున్నది. ప్రస్తుతం సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 86.36 శాతం వాటా కలిగివున్నది.