Road Accident | బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పాట్నాలో టెంపో (tempo) వాహనాన్ని ట్రక్కు (truck) బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. పాట్నా (Patna)లోని షాజహాన్‌పూర్ (Shahjahanpur) పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గల ఓ ఫ్యాక్టరీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలంద జిల్లాకు చెందిన పలువురు గంగా నదిలో స్నానం అనంతరం ఫత్వా (Fatwah) నుంచి స్వగ్రామానికి టెంపో వాహనంలో బయల్దేరారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనాన్ని అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో పూర్తిగా ముక్కలైపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు నలుగురు గాయపడ్డారు. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
TikTok | మళ్లీ భారత్‌లోకి టిక్ టాక్..? ప్రభుత్వ వర్గాలు ఏం చెప్పాయంటే..?
Tejashwi Yadav | ప్రధాని మోదీపై అభ్యంతరకరపోస్ట్.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
Earthquake | నేపాల్‌ను వణికించిన భూకంపం