Tejashwi Yadav | ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)పై మహారాష్ట్ర (Maharashtra)లో కేసు నమోదైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టారన్న ఆరోపణలతో పోలీసులు తేజస్వీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు (FIR Filed Against Tejashwi Yadav).
బీహార్‌లోని గయా జిల్లాలో ఇటీవలే ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటన సందర్భంగా ప్రధానిని ఉద్దేశిస్తూ తేజస్వీ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు పెట్టారంటూ గడ్చిరోలికి (Gadchiroli) చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ నరోటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. తేజస్వీపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
आज गया में लगेगी झूठ और जुमलों की दुकान!
प्रधानमंत्री जी, गया में बिना हड्डी की जुबान से आज झूठ और जुमलों का हिमालय खड़ा करेंगे लेकिन बिहार के न्यायप्रिय जनता दशरथ मांझी की तरह उनके झूठ और जुमलों के इन विशाल पहाड़ों को तोड़ देगी।
11 साल अपनी और 20 वर्षों की एनडीए सरकार के 20… pic.twitter.com/X1KRhb80pY
— Tejashwi Yadav (@yadavtejashwi) August 22, 2025
Also Read..
Cloudburst | ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్.. బాలిక మృతి.. అనేక మంది మిస్సింగ్
Earthquake | నేపాల్‌ను వణికించిన భూకంపం
Ganesh Idol: ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో గణేశుడి విగ్రహం.. హైదరాబాద్ ఉప్పుగూడలో మండపం ఏర్పాటు