Earthquake | హిమాలయ దేశం (Himalayan country) నేపాల్ (Nepal)లో భూకంపం (Earthquake) సంభవించింది. శుక్రవారం రాత్రి 11:15 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.4గా నమోదైంది.
జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం ప్రకారం.. తూర్పు నేపాల్ (Eastern Nepal)లోని శంఖువాసభ (Sankhuwasabha) జిల్లాలో భూమి ఒక్కసారిగా కంపించింది. మాఘంగ్ ప్రాంతంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం ధాటికి తూర్పు నేపాల్‌లోని పలు జిల్లాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా, నేపాల్‌లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015 ఏప్రిల్‌లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Also Read..
Ganesh Idol: ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో గణేశుడి విగ్రహం.. హైదరాబాద్ ఉప్పుగూడలో మండపం ఏర్పాటు
Cloudburst | ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్.. బాలిక మృతి.. అనేక మంది మిస్సింగ్
ఆన్లైన్ గేమ్స్ నిషేధ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం