న్యూఢిల్లీ, ఆగస్టు 22 : ఆన్లైన్ గేమ్స్‌ని నిషేధిస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టరూపంలోకి వచ్చింది. ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్లన్నిటినీ ఈ చట్టం నిషేధించింది. ఈ మనీ గేమింగ్‌లను ప్రమోట్ చేసిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధించడానికి చట్టం అవకాశం కల్పిస్తోంది.
అటువంటి ప్లాట్‌ఫారాల తరఫున ప్రచారం చేసిన వారికి సైతం 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు, 2025ని రాజ్యసభ గురువారం 26 నిమిషాల్లో ఆమోదించగా అంతకుముందు రోజు లోక్‌సభ కేవలం 7 నిమిషాలలో ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించింది.