ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 13:20:17

డిఎన్ఆర్ఈ తో ఈఈఎస్ఎల్ ఒప్పందం

డిఎన్ఆర్ఈ తో ఈఈఎస్ఎల్ ఒప్పందం

ఢిల్లీ :గోవాలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ, నూతన, పునరుత్పాదక ఇంధన విభాగం (డిఎన్ఆర్ఇ) క్రింద ప్రభుత్వరంగ సంస్థల ఉమ్మడి సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) దేశంలోనే మొట్టమొదటి కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ప్రారంభించడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్, గోవా విద్యుత్ మంత్రి  నీలేష్ కాబ్రాల్, విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సహాయ్ ఇతర అధికారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, ఈఈఎస్ఎల్, డిఎన్ఆర్ఈ సాధ్యాసాధ్య అధ్యయనాలు, వికేంద్రీకృత సౌర శక్తి ప్రాజెక్టుల అమలును నిర్వహిస్తాయి. ఈఈఎస్ఎల్ సౌర శక్తి ప్రాజెక్టులను అమలు చేస్తుంది, 100 మెగావాట్ల వికేంద్రీకృత గ్రౌండ్ మౌంటెడ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను వ్యవసాయ పంపింగ్ కోసం ఉపయోగించుకోవాలి, సుమారు 6,300 వ్యవసాయ పంపులను బీఇ స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పంపులతో భర్తీ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల గృహాలకు సుమారు16 లక్షల ఎల్ఈడి బల్బులను పంపిణీ చేస్తుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.