ED raids | ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ (ex RG Kar principals) డాక్టర్ సందీప్ ఘోష్ (Dr Sandip Ghosh) ఫామ్ హౌస్ (farmhouse)లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఆయన ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైద్యురాలి ఘటనలో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై అవినీతి ఆరోపణలు (Corruption case) వెల్లువెత్తాయి. ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని (financial fraud case) విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసు నేపథ్యంలో తాజాగా ఉత్తర కోల్‌కోతలోని ప్రొ. సందీప్ ఘోష్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED raids) అధికారులు మంగళవారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. మరోవైపు సందీప్ నివాసంతోపాటు ఆ ఆసుపత్రికి వైద్య పరికరాలు సరఫరా చేసిన సంస్థ, ముందులు విక్రయించిన సంస్థలపై ఇప్పటికే ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
Also Read..
Atishi | ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశీ.. ప్రకటించిన ఆప్
PM Modi: ప్రధాని మోదీ 74వ పుట్టిన రోజు.. విషెస్ తెలిపిన బీజేపీ నేతలు
Jani Master | సాయి ధరమ్ తేజ్ ఎక్కడ ఉన్నావు.. జానీ మాస్టర్ కేసుపై ట్రోల్ అవుతున్న మెగా హీరో