Jani Master – Sai Dharam Tej | టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించాడంటూ ఒక మహిళ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు జానీ మాస్ట్ర్పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారు. ఇక జానీ మాస్టర్ లాంటి వాళ్లని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.
ఇదిలావుంటే ఈ ఘటనపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ను నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. స్పందించకుండా ఏం చేస్తున్నావు కామెంట్లు పెడుతున్నారు. అసలు ఈ విషయంలో మెగా హీరో ఎందుకు తిడుతున్నారంటే.. అప్పట్లో యూట్యూబర్ ఫనుమంతు అనే వ్యక్తి చిన్నపిల్లలను లైంగికంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అతడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సాయి ధరమ్ తేజ్ విజ్ఞప్తి చేశాడు. దీంతో ఈ విషయంపై అప్పుడు సాయి ధరమ్ తేజ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు.
అయితే జానీ మాస్టర్ ఘటనపై అసలు సాయి ధరమ్ తేజ్ స్పందిచక పోవడంపై తప్పుబడుతున్నారు నెటిజన్లు. జానీ మాస్టర్ జనసేన కార్యకర్త, అలాగే మెగా హీరోలకు అత్యంత సన్నిహితుడు అనే అతడిపై స్పందించడానికి సాయి ధరమ్ తేజ్ మాటా రావాట్లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.