Minister Senthilbalaji | మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో (Money-laundering case) తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని (Minister Senthilbalaji) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. చెన్నైలోని (Chennai) ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈడీ ప్రకటించింది.
చెన్నై: మనీలాండరింగ్ కేసులో (Money-laundering case) తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని (Minister Senthilbalaji) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. చెన్నైలోని (Chennai) ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈడీ ప్రకటించింది. అయితే తమ అదుపులోకి తీసుకుంటుండగా బాలాజీకి ఛాతీ నొప్పి రావడంతో ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ దవాఖానకు (overnment Multi Super Specialty Hospital) తరలించారు. ఆయన ఇంట్లో లభించిన పత్రాలను సీజ్ చేసిన అధికారులు మూడు కార్లలో తమవెంట తీసుకెళ్లారు. కాగా, బాలాజీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అధికార డీఎంకే ఎంపీ, న్యాయవాది ఇళంగో (MP NR Elango) తెలిపారు.
రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, వైద్యశాఖ మంత్రి సుబ్రమనియణ్, పీడబ్ల్యూడీ మంత్రి ఈవీ వేలు దవాఖానలతో సెంథిల్ బాలాజీని పలకలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మాట్లాడుతూ.. దీనిని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపు రాజకీయాలకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
తమిళనాడు సచివాలయంలో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సెక్రటేరియట్లోని సెంథిల్ బాలాజీతో చాంబర్తోపాటు కొందరి ఇండ్లు, కార్యాలయాలయాలపై దాడులు చేశారు. ఈరోడ్లోని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లారీ కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని మంత్రిపై ఈడీ ఆరోపిస్తున్నది. గత నెల బాలాజీ సన్నిహితుల ఇండ్లల్లో ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు.
https://twitter.com/ANI/status/1668737885242286080?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1668737885242286080%7Ctwgr%5Ef0f419fc74f1519c66c1f510bfb8b758a0e55ceb%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.thehindu.com%2Fnews%2Fnational%2Ftamil-nadu%2Fsenthil-balaji-ed-officials-raid-arrest-june-14%2Farticle66966195.ece
Chennai | Senthil Balaji is undergoing treatment. We will deal with it legally. We are not afraid of the threatening politics of the BJP-led central government: Tamil Nadu Minister Udhayanidhi Stalin https://t.co/o8C8Mca3RH pic.twitter.com/5ybLmiqsPH
— ANI (@ANI) June 13, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

